- ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసినా.. ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తొలి దశ ఎన్నికల్లో తెదేపాకు 38.74 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ మీడియాతో మాట్లాడకూడదన్న ఎస్ఈసీ ఆదేశాలను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా....మాట్లాడేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధం'
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై.. ఉద్యమం ఉపందుకుంది. స్టీల్ కంపెనీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరోవైపు.. రాజీనామా చేసైనా.. ఆంధ్రుల హక్కు పరిరక్షించుకుంటామని.. వైకాపా నేతలు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఓడరేవుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు-2020కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే లోక్‌సభ గడప దాటిన ఈ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించగా.. 84 మంది మద్దతిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం
రోజురోజుకూ పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయికి పెరుగుతున్నాయి. అయితే ధరల పెంపునకు కారణం ప్రభుత్వం కాదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాజ్యసభలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమధానమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చైనాలో చిక్కుకున్న భారత నావికులకు విముక్తి!