1. రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి 13 వేల 98కు బాధితుల సంఖ్య చేరింది. తాజా కేసుల్లో.. రాష్ట్రానికి చెందిన 755 మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మందికి.. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా సోకింది. వైరస్ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
2. పాస్ చేస్తారా.. పరీక్ష పెడతారా..?
కరోనాతో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ అదే నిర్ణయం తీసుకుంది. కేంద్రం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసింది. అయితే దూరవిద్య విధానంలో పది, ఇంటర్మీడియట్ చదువుతున్న వారి విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
3. తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్' అక్షర నివాళి
బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఎన్నో భాషల్లో నిష్ణాతుడు ఆయన. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా.. ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని 'ఈటీవీ భారత్' అందిస్తున్న ప్రత్యేక కథనాలు మీకోసం. క్లిక్ చేయండి
4. పీవీజీ.. భరతమాత ముద్దుబిడ్డ: మోదీ
మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శ్రద్ధాంజలి ఘటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా.. దేశం మొత్తం భారతమాత ముద్దుబిడ్డను గుర్తు చేసుకుంటోందని పేర్కొన్నారు. కీలకమైన దశలో భారత్‌కు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
5. 'పరీక్షలు పెంచాం.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్'
దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళుతున్నట్లు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము తీసుకునే ప్రతి నిర్ణయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భాగస్వాములవుతున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి