ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

TOP NEWS @ 1 PM
ప్రధాన వార్తలు @1PM

By

Published : Jul 6, 2020, 1:00 PM IST

  • మళ్లీ వాయిదా
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. కరోనా వ్యాప్తి ముప్పుతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8న వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే... ఇంతలోనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఎవ్వరూ ఆందోళన చెందవద్దు
    టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా..?'
    రాష్ట్ర ప్రభుత్వం తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను నిరుపయోగంగా వదిలేస్తుందని తెదేపా ఎమ్మెల్సీ ఆశోక్​ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. కరోనా వల్ల వెనక్కి తగ్గామని.. లేకుంటే ఉద్యమం చేసే వాళ్లమని అన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'పౌష్టికాహారం అందించాలి'
    రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలకు పౌష్టికాహారం అందించాలని కోరుతూ సీపీఐ రామకృష్ణ సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా పరీక్షలు విస్తృతంగా చేపట్టాలని కోరారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • గల్వాన్​ నుంచి వెనక్కి
    భారత్‌ - చైనా కమాండర్ల స్థాయి అధికారుల చర్చల్లో పురోగతి లభించింది. గల్వాన్‌ సరిహద్దు వద్ద 1 నుంచి 2 కి.మీ. మేర తగ్గిన చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అడ్డుకున్న భారత్
    సరిహద్దులో మరో దుస్సాహసానికి పాల్పడింది నేపాల్. ఉత్తర్​ప్రదేశ్ పిలిభీత్ వద్ద ఇరుదేశాలు ఉపయోగించకూడని ప్రదేశంలో రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. నేపాల్ ప్రయత్నాన్ని అడ్డుకుంది భారత్. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అంకురాలు కుదేలు!
    కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు తీవ్రంగా కుదేలయ్యాయి. ముఖ్యంగా నిధుల కొరత, వ్యాపార కార్యకలాపాల్లో క్షీణత వంటి గడ్డు పరిస్థితులు ఏర్పడాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'గాలి ద్వారా ‌ వ్యాప్తి'
    గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది ఓ శాస్త్రవేత్తల బృందం. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌ఓకు సూచించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • కోహ్లీ తిరగరాస్తాడు
    క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ నెలకొల్పిన 100 సెంచరీల రికార్జును కోహ్లీ తిరగరాస్తాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​ తెలిపాడు. ఇటీవలే తన యూట్యూబ్​ ఛానెల్​లో మాట్లాడిన హాగ్​.. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్​ టీమ్​ఇండియా సొంతమని వెల్లడించాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • హాలీవుడ్ నటుడు మృతి
    గత మూడు నెలలుగా కరోనాతో పోరాడిన హాలీవుడ్​ నటుడు నిక్ కోర్డియో తుదిశ్వాస విడిచారు. పలు సినిమాలతో సహా టీవీ షోల్లో నటించి అభిమానుల్ని మనసుల్లో చోటు సంపాదించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details