- 20వేల కోట్ల ఆస్తి... 30 లక్షల కుటుంబాలకు
ఆగస్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన... పట్టాల పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చూడాలని సూచించారు. స్టాక్ యార్డుల్లో భారీ ఎత్తున నిల్వలు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- వదలకుండా దోచుకుంటున్నారు
భూ సేకరణ పేరుతో వైకాపా నేతలు భారీ దోపిడీకి తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. శ్మశానాలనూ వదలకుండా దోచుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. భూసేకరణలో వైకాపా భారీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు వర్చువల్ ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గానికి చెందిన ఇళ్ల లబ్ధిదారులతో చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- తెదేపా అడ్డుకుంది
మహిళలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తెదేపా పిటిషన్లు వేసి అన్యాయం చేస్తోందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కలను తెదేపా అడ్డుకుంటోందని ఆరోపించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా సోకిందో లేదో చెప్పండి
డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఈరోజు ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా ఏ విషయాన్ని ధృవీకరించలేదు. భాజపా నేత బండి ప్రభాకర్ ఈ విషయంపై స్పందించారు. ఉప ముఖ్యమంత్రికి కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని వైద్యాధికారులు వెల్లడించాలన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా దెబ్బ- ఏళ్ల శ్రమ వృథా!
కరోనా ఉద్ధృతితో ఏకకాలంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. జనజీవనంపై లాక్డౌన్ ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం అన్లాక్ దశ మొదలైనప్పటికీ.. కొన్ని విషయాల్లో కరోనా దీర్ఘకాల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో పోషకాహార లోపం కూడా ఒకటి. గత కొన్నేళ్లుగా పోషకాహార లోపాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు లాక్డౌన్ కారణంగా ఆగిపోయాయని... వాటిని పునఃప్రారంభించి ఈ పోరులో వేగం పెంచాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనాపై పోరే క్లిష్టం'