- రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి
ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి.. రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. భగవంతుడి విగ్రహాలు ధ్వంసం చేసిన చోటును పరిశీలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం లేదు... కోడి మాంసం, గుడ్లు తినొచ్చు'
బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోకి ప్రవేశించిన దాఖలాలు లేవని... ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం లేదని స్పష్టం చేశారు. బర్డ్ ప్లూ ఉందన్న అపోహలతో కోడి మాంసం, కోడి గుడ్లు తినడానికి భయపడాల్సిన అవసరం లేదంటున్న పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అధిపతి రాణి ప్రమీలతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాసిపెట్టుకోండి.. సాగు చట్టాలు వెనక్కే: రాహుల్
కొందరు వ్యాపారవేత్తల కోసం రైతులను నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కదన్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటుందని... తన మాటలను రాసిపెట్టుకోవాలని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఈ నెల 31న పల్స్ పోలియో
కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా వాయిదా పడ్డ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపేంద్ర
రైతు సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ మాన్ తప్పుకున్నారు. రైతుల ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సిరియాపై వైమానిక దాడి- 40 మంది మృతి!