తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదాంతమైంది. మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు. 17 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. 11.30 గంటల పాటు బోరుగుంతలో ఉండడం వల్ల ఆక్సిజన్ అందక చిన్నారి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఫలించని అధికారుల శ్రమ
బుధవారం సాయంత్రం 5.45 గంటలకు బాలుడు సాయివర్ధన్ పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆక్సిజన్ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ... అవేమీ ఫలించలేదు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి దాదాపు 8.30 గంటలపాటు శ్రమించి బాలుణ్ని వెలికితీశాయి. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కేసింగ్ వేయకపోవడం వల్లే