ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థుల పేర్లు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన అయోధ్య రామిరెడ్డిల పేర్లు మూడు స్థానాలకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగో స్థానం విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది. ఈ స్థానాన్ని పార్టీ ముఖ్య నేత, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇటీవల రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీని తిరిగి రాజ్యసభకు పంపేందుకు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు వైకాపా వర్గాల కథనం. నత్వానీకి అవకాశం ఇస్తే రిలయన్స్ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్యసభకు ముగ్గురు వైకాపా అభ్యర్థులు ఖరారు! - వైకాపా రాజ్యసభ అభ్యర్థులు
ఏపీ నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థుల్లో ముగ్గురి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మంత్రులు ఉన్నట్లు సమాచారం. నాలుగో స్థానం విషయంలో వైకాపా సమాలోచనలు చేస్తోంది. అంబానీ మిత్రుడు పరిమళ్ నత్వానీని రాజ్యసభకు పంపాలా వద్దా అనే విషయంపై నేడు పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారు.
ycp rajyasabha
ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన జగన్ మూడు స్థానాలకు మోపిదేవి, బోస్, రామిరెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం. అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప ఈ ముగ్గురి ఎంపికలో మార్పు ఉండకపోవచ్చంటున్నారు. నాలుగో స్థానం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై శుక్రవారం జగన్ పార్టీ నేతలతో మరోసారి చర్చించనున్నారు.
ఇదీ చదవండి
Last Updated : Mar 6, 2020, 7:21 AM IST