ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయస్థానాల్లో ఈ నెల 20 నుంచి హైబ్రిడ్ విధానంలో విచారణలు

హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాల్లో ఈ నెల 20 నుంచి హైబ్రిడ్ విధానంలో విచారణలు ప్రారంభంకానున్నాయి.ప్రయోగాత్మకంగా , పరిమిత సంఖ్యలో ఈ తరహా విచారణలు మొదలు పెట్టనున్నట్లు హైకోర్టు పరిపాలనపరమైన నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఆన్​లైన్ విచారణ విధానం ఈనెల 19 వరకు కొనసాగనుందని పేర్కొంది

high court
హైకోర్టు

By

Published : Sep 7, 2021, 2:59 AM IST

హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో ఈ నెల 20 నుంచి హైబ్రిడ్ విధానం(భౌతిక, ఆన్​లైన్​ పద్ధతి)లో విచారణలు ప్రారంభంకానున్నాయి. ప్రయోగాత్మకంగా , పరిమిత సంఖ్యలో ఈ తరహా విచారణలు మొదలు పెట్టనున్నట్లు హైకోర్టు పరిపాలనపరమైన నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ మొదటి వారంలో పరిస్థితిని మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది. ప్రభుత్వం జారీచేసిన కొవిడ్ నిబంధనలకు, హైకోర్టు ఎప్పటికప్పుడు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణలు జరగనున్నాయని వెల్లడించింది . ప్రస్తుత ఆన్​లైన్ విచారణ విధానం ఈనెల 19 వరకు కొనసాగనుందని పేర్కొంది .

ABOUT THE AUTHOR

...view details