ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం - bjp state pressident kanna

భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన కోడలు సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

the-tragedy-at-kanna-lakshminarayanas-home-in-hyderabad
కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం

By

Published : May 29, 2020, 7:50 AM IST

హైదరాబాద్‌ గచ్చిబౌలి హిల్‌రిడ్జ్‌ విల్లాస్‌లో ఉంటున్న సుహారిక గురువారం ఉదయం స్థానిక మీనాక్షి బాంబూస్‌లోని మిత్రుడు పవన్‌రెడ్డి ఇంటికెళ్లారు. అక్కడ వికాస్‌, వివాస్‌, ప్రవీణ్‌ తదితరులు కలిసి విందు చేసుకున్నారు. సరిగ్గా 11.30 గంటలకు ఉన్నట్లుండి సుహారిక కుప్పకూలడంతో వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. సాయంత్రం 5.30 గంటలకు మృతురాలి తల్లి మల్లి సాగరిక ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి అనుమానాలు లేవని, గుండెపోటుతో మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లుగా సీఐ చెప్పారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని, శవ పరీక్ష పూర్తయిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని వివరించారు.

సమాచారం తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. సుహారిక.. కన్నా రెండో కుమారుడు ఫణీంద్ర భార్య. వీరిది ప్రేమవివాహం. ఆమె స్వస్థలం నెల్లూరు.

ఇదీచదవండి.

లోపాలు సరిదిద్దుకుందాం.... యువశక్తితో కదులుదాం...

ABOUT THE AUTHOR

...view details