ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉపాధి హామీ బకాయిలు పిటిషనర్లకు చెల్లించాం' - హైకోర్టు తాజా వార్తలు

ఉపాధి హామీ పనుల బకాయిలను కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు మెమో దాఖలు చేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Jul 20, 2021, 1:59 AM IST

ఉపాధి హామీ పనుల బకాయిలను కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు మెమో దాఖలు చేసింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తి ఆ సొమ్ము పిటిషనర్ల ఖాతాలకు బదిలీ అయ్యేందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

పిటిషనర్ల ఖాతాల్లో సొమ్ము జమ అయిందా లేదా అన్నది తదుపరి విచారణలో కోర్టుకు నివేదించాలని వారి తరపు న్యాయవాదులను కోరారు. విచారణను ఈ నెల 30 కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇదీచదవండి:

Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

ABOUT THE AUTHOR

...view details