దివంగత నేత నోముల నర్సింహయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేల మృతికి శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించనుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం కానుంది. నేడు కేవలం సంతాపాలకు మాత్రమే సభ పరిమితం కానుంది.
ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్యకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, సభ్యులు సంతాప తీర్మానంపై మాట్లాడతారు. ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సభ సంతాపం తెలపనుంది.