రాష్ట్రంలో పరిషత్తు ఎన్నికలను నిలిపివేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అధికారపక్షం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయించుకున్నందున తాము ఎన్నికల ప్రక్రియను తొలి నుంచి నిర్వహించాలని కోరుతూ వచ్చామని పేర్కొంది.
సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ సమయంలో ఎన్నికలు కొనసాగించేలా నోటిఫికేషన్ ఇవ్వడంపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను హైకోర్టు సమర్దించిందని తెలిపింది. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్ ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి.... తొలి నుంచి ఎన్నికలు జరపాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి, పిటిషనర్ పాతూరి నాగభూషణం కోరారు.