కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో.. లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: నారా లోకేశ్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నందున.. విద్యార్థులను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు.. తమ విద్యార్థులను కాపాడుకునేందుకు పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ జగన్ మాత్రం తాడేపల్లి గడప కూడా దాటి రావడం లేదని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులను మాత్రం పరీక్షల పేరుతో కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే పరీక్షల రద్దు ప్రకటించకపోతే తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీచదవండి.