ప్రియురాలి కోసం మూడేళ్ల క్రితం పాకిస్థాన్‌కు వెళ్లిన తెలుగు యువకుడుప్రశాంత్ ఎట్టకేలకు తమ కుటుంబాన్ని చేరుకున్నాడు. సీపీ సజ్జనార్.. ప్రశాంత్‌ను తమ కుటుంబసభ్యులకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రానికి ప్రశాంత్.. ధన్యవాదాలు తెలిపాడు. రెండు ప్రభుత్వాలకు రుణపడి ఉంటానని తెలిపాడు.
తన సమస్యను భారత్-పాక్ మధ్య సమస్యగా చూడకూడదన్నాడు. రెండు దేశాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉన్నారని ప్రశాంత్ పేర్కొన్నాడు. పాకిస్థానీయులు అంత చెడ్డవారేమీ కారని తెలిపాడు. జైలులో భారతీయులతో పని చేయించరని ప్రశాంత్ వివరించాడు. కారాగారంలో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకున్నానన్నాడు. భారతీయుల కోసం జైలులో ప్రత్యేక గదులు ఉండేవన్నాడు.
"తల్లిదండ్రుల మాటలు వినకపోతే జీవితంలో కష్టాలు వస్తాయి. నేను వెళ్లే ముందు మా అమ్మ ఆపేందుకు ప్రయత్నించింది. అమ్మ మాట విననందుకు 4 ఏళ్లు కుటుంబానికి దూరమయ్యా. అసలు తిరిగి వస్తానని అనుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే మళ్లీ తల్లిదండ్రులను చూడగలిగా. నాలుగేళ్లలో హిందీ మాట్లాడటం నేర్చుకున్నా."- ప్రశాంత్