ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

తెలంగాణలో పురపోరుకు ఆ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

By

Published : Oct 22, 2019, 1:16 PM IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

తెలంగాణలో పురపోరుకు ఆ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది. పదవీకాలం ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం గతంలోనే కసరత్తు ప్రారంభించాయి. అయితే ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా వార్డుల విభజన... తదితర అంశాలు చట్టబద్ధంగా జరగలేదని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత అన్నింటినీ సరిచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పుతో తెలంగాణలో పురపాలక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

ABOUT THE AUTHOR

...view details