ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Group-1 exam: తెలంగాణలో ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్ష.. వారికి నో ఎంట్రీ

Group1 preliminary exam: తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 పరీక్ష కావడంతో అభ్యర్థులు భారీగా హాజరైయ్యారు.

Group1 preliminary exam
ప్రశాంతంగా గ్రూప్-1

By

Published : Oct 16, 2022, 2:27 PM IST

Group1 exam in Telangana: తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష భారీ భద్రత నడుమ ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగనున్న ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం గం 8.30 నుంచి లోపలకి అనుమతించారు. గం 10.15 తరువాత అన్ని గేట్లు బంద్ చేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతి నిరాకరించారు. ఆలస్యమవడంతో అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపారు. హనుమకొండలో పరీక్షా కేంద్రానికి పసిబిడ్డతో వచ్చిన మహిళా అభ్యర్థి ఆలస్యం కావడంతో వెనుతిరిగింది. సిద్దిపేటలో 20 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుండగా.. వివిధ కేంద్రాల్లో 11 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వారందరిని అధికారులు వెనక్కి పంపారు.

Group1 preliminary exam

39వేల మంది దూరం...!పరీక్షకు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, శనివారం అర్ధరాత్రి వరకు 3.41 లక్షల మంది హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. చివరి రోజున సుమారు 20 వేల మంది హాల్‌టికెట్లు తీసుకున్నారు.

మూడు జిల్లాల్లో ఎక్కువ...గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 349 కేంద్రాలు ఉంటే.. దాదాపు 1.55 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో అత్యధికంగా 51,931 మంది, ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 1,933 మంది పరీక్ష రాశారు.

ఆత్మవిశ్వాసంతో రాయండిఇన్నాళ్లూ చదివింది గుర్తు చేసుకొని, పూర్తి ఆత్మవిశ్వాసంతో గ్రూపు-1 పరీక్ష రాయాలని మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబిత లను అభినందించారు. అభ్యర్థులకు శుభాశీస్సులు తెలిపారు.

Group1 preliminary exam

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details