ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 925 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా 925 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

telangana
telangana

By

Published : Nov 21, 2020, 10:48 AM IST

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ హెచ్చుతున్నాయి. కొత్తగా 925 కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,62,653 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బారిన పడి ఇప్పటివరకు 1,426 మంది మృతి చెందారు.

కరోనా నుంచి మరో 1,367 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 9,741 మంది బాధితులుండటం గమనార్హం. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 161 కరోనా కేసులు నమోదుకాగా... మేడ్చల్‌ జిల్లాలో 91, రంగారెడ్డి జిల్లాలో 75 మందికి కొవిడ్​ సోకింది.

ఇదీ చూడండి: గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details