ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2022, 12:01 PM IST

Updated : Oct 17, 2022, 12:49 PM IST

ETV Bharat / city

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరుకాని తెలంగాణ, ఏపీ అధికారులు

KRMB On Officers
కృష్ణానదీ యాజమాన్య బోర్డు

11:59 October 17

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ కమిటీ సమావేశం

KRMB Meeting Today: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ ఇవాళ మరోమారు సమావేశమైంది. జలసౌధలో కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై ఆధ్వర్యంలో భేటీ జరిగింది. అయితే ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు మాత్రం హాజరుకాలేదు. కేవలం బోర్డు అధికారులతోనే సమావేశం కొనసాగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్​లో జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరదజలాల లెక్కలు, రూల్ కర్వ్స్​కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేసేందుకు గతంలోనే ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అయితే వివిధ కారణాల రీత్యా సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆర్ఎంసీ ఐదో సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్ళై కన్వీనర్​గా వ్యవహరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం సమావేశంలో పాల్గొనలేదు. అయితే ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తమకు వీలు కాదని.. మరోరోజు సమావేశం నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు.

అటు తెలంగాణ అధికారులు కూడా ఆర్ఎంసీ సమావేశంపై అసంతృప్తిగా ఉన్నారు. తమ అభిప్రాయాలను పొందుపరచడం లేదని.. తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంసీ సమావేశంలో పాల్గొనడం వల్ల ఏం ఫలితం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చడంతో పాటు కోరిన సమాచారం ఇచ్చిన తర్వాతే సమావేశం నిర్వహించాలని ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 12:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details