ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు బీమా ప్రీమియంపై రాత్రికి రాత్రే జీవోనా?: అచ్చెన్నాయుడు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

రైతు బీమా ప్రీమియం చెల్లించినట్లు జీవో విడుదల చేయటంపై వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పంట నష్టపోయాక, రైతులు మరణించాక పరిహారం చెల్లిస్తే లాభమేంటని ప్రశ్నించారు.

Achenna_on_Crop_Insurance
Achenna_on_Crop_Insurance

By

Published : Dec 1, 2020, 10:10 AM IST

రైతు బీమా ప్రీమియం చెల్లించినట్లు రాత్రికిరాత్రే జీవో విడుదల చేయటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ప్రీమియం చెల్లిస్తే లాభమేంటని నిలదీశారు. రైతులు మరణించాక ఇన్సూరెన్స్​ చేస్తే లాభం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేతలపై అధికార పార్టీ నేతలు అగౌరవ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు గౌరవంగా మాట్లాడకపోతే తామూ అదే భాషలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details