ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ సొమ్ము కాజేస్తే.. ఊరుకోం'

సీఎం జగన్ తన అవినీతి దాహం తీర్చుకునే క్రమంలో సహజ సంపద అయిన సిలికా ఖనిజాన్ని గంపగుత్తగా శేఖర్ రెడ్డికి అప్పగిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు

By

Published : Feb 6, 2021, 8:30 PM IST

Tdp spokes person raffi criticize on cm jagan
తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అవినీతి దాహం తీర్చుకునేందుకు సహజ సంపద అయిన సిలికా ఖనిజాన్ని గంపగుత్తగా శేఖర్ రెడ్డికి అప్పగిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. రాష్ట్రంలోని 3వేల 150 ఎకరాల సిలికా గనులను, వాటి ద్వారా వచ్చే 8వేల టన్నుల ఖనిజాన్ని శేఖర్​రెడ్డికి ఇవ్వటం ద్వారా రూ. 6వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఇప్పటికే సిలికా గనులున్న వ్యాపారులపై, మైనింగ్ శాఖలోని కీలక అధికారి బెదిరింపులకు దిగారని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్మును కాజేస్తూ, ఒకే వ్యక్తికి ఖనిజ సంపదను అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని రఫీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details