కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగధీరుడు ఎన్టీఆర్ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశంసించారు. నందమూరి తారకరామారావు అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమని అన్నారు.
ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్.. అభ్యుదయవాది
బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమ సమాజవాది, పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది, మహిళలకు సమాన హక్కులు కల్పించిన అభ్యుదయవాది ఎన్టీఆర్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కొనియాడారు. ఆ మహానుభావుని ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదామని ఆకాంక్షించారు. 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అన్న మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఇదీ చూడండి:
అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం