ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా ప్రజలకు శాపమైతే.. వైకాపా నేతలకు వరం' - tdp mlc budha venkanna latest press meet

రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం జగన్​ పట్టించుకోవడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ప్రజలకు శాపంలా మారిన కరోనా.. వైకాపా నేతలకు వరంలా మారిందని మండిపడ్డారు.

'కరోనా ప్రజలకు శాపమైతే.. వైకాపా నేతలకు వరం'
'కరోనా ప్రజలకు శాపమైతే.. వైకాపా నేతలకు వరం'

By

Published : Jun 8, 2020, 3:25 PM IST

రాష్ట్రంలో పేదల ఆకలి చావులకు ముఖ్యమంత్రి జగన్​ ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారని.. తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్​ ఏడాది పాలన అట్టర్​ ఫ్లాప్​ సినిమా అని ఎద్దేవా చేశారు. కరోనా ప్రజలకు ఒక శాపం అయితే... వైకాపా నేతలకు ఒక వరం లాగా మారిందని విమర్శించారు.

80 రోజుల నుంచి ప్రజలు చనిపోతున్నా.. తాడేపల్లి రాజమహల్ వదిలి ముఖ్యమంత్రి బయటకి రావడం లేదని దుయ్యబట్టారు. నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటారో జగన్ సమాధానం చెప్పాలని బుద్దా డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details