మాపై పెట్టిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు(TDP mlc ashok babu) అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. ఫలితంగా పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu naidu) 36 గంటల దీక్ష చేపట్టనున్నారని వెల్లడించారు. వైకాపా డ్రగ్ మాఫియాను తెదేపా బయటపెడుతోందనే అక్కసుతో దాడులకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ(panchumarthi anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్రం కార్యాలయంపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.
TDP leaders: 'మాపై పెట్టిన కేసులను న్యాయస్థానంలోనే ఎదుర్కొంటాం'
తెదేపా కేంద్ర కార్యాలయం(TDP central office) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పార్టీ ఆఫీసులపై జరిగిన దాడుల(attack)ను ఆ పార్టీ నేతలు ఖండించారు. వైకాపా డ్రగ్ మాఫియాను తెలుగుదేశం బయటపెడుతోందన్న అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.
తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు
తెదేపా రాష్ట్ర బంద్ పిలుపుతో పార్టీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా(nagul meera) ను పోలీసులు గృహనిర్బంధం చేసారు. వైస్సార్సీపీ గూండాలు తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. నిన్నటి దాడులు ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలో చీకటి రోజులుగా నిలిచిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.
Last Updated : Oct 20, 2021, 7:50 PM IST