ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్​.. జనాన్ని బురిడీ కొట్టించారు' - సీఎం జగన్​పై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

సీఎం జగన్​పై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders comments on cm jagan
tdp leaders comments on cm jagan

By

Published : Apr 2, 2021, 11:17 AM IST

సీఎం జగన్​లా మోసగించే వారిని మన దేశమే కాదు, ఏ దేశమూ ఇప్పటివరకు చూసి ఉండదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామంటూ జనాన్ని బురిడీ కొట్టించారని ట్విట్​ర్​లో దుయ్యబట్టారు. సీపీఎస్​ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని బుట్టలో వేసుకున్నారని.. 45 ఏళ్లకే పింఛనంటూ వంచించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి అథఃపాతాళానికి దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఎం జగన్​ ఉద్యోగ‌, నిరుద్యోగ‌, విద్యార్థి, మ‌హిళ‌, యువ‌త‌, రైతు, కార్మిక‌, కూలీల‌ను అందరినీ మోసం చేశారని అన్నారు.

ఇదీ చదవండి:గ్రామాల విలీనంపై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 20కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details