TDP LEADER YANAMALA : ఎక్కడా అప్పు పుట్టకపోవడంతోనే.. సంపూర్ణ గృహహక్కు పేరుతో జగన్ ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పేదల ఇళ్లకు 12సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయని గుర్తు చేశారు.
TDP LEADER YANAMALA : 'అప్పు పుట్టకనే.. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త నాటకం' - yanamala comments on ots
TDP LEADER YANAMALA : అప్పు పుట్టకనే.. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని తెదేపా నేత యనమల అన్నారు. ఓటీఎస్ పేరుతో రూ.5 వేల కోట్ల దోపిడీకి ప్రణాళిక రచించారని ఆరోపించారు.
తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు
వాస్తవాలను మరుగునపెట్టి సెటిల్ మెంట్ చేస్తామనడం.. పేదప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. ఓటిఎస్ పేరుతో పేదల నుంచి 5 వేల కోట్లు దోచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని ధ్వజమెత్తారు. రాజధానిలో గత ప్రభుత్వ హయాంలో కట్టించిన 5వేల ఇళ్లు పేదలకు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.