ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం' - అమరావతిపై వర్ల రామయ్య కామెంట్స్

అమరావతి లేకుండా చేయాలని జరుగుతున్న కుట్రలను ప్రజలకు తెలిపేందుకు తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Tdp leader varla ramayya  on amaravathi
'అమరావతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం'

By

Published : Dec 2, 2019, 11:08 PM IST

మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేతలు
రాజధానిపై ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. అమరావతిని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అమరావతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. రాజధాని అభివృద్ధి నిలిపివేసి.. నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వం నిద్రలేచే విధంగా తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నట్లు వర్ల రామయ్య తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details