చంద్రబాబు ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్ విసిరారు. జగన్ తండ్రి సీఎం కాకముందు, ఇప్పుడు ఆస్తులెంతో చర్చించేందుకు జగన్ సిద్ధమా? అని ఆయన నిలదీశారు. అవినీతి బురదలో పూర్తిగా కూరుకుపోయిన వైకాపా నేతలు ఎన్నికల్లో తెదేపా డబ్బు పంచలేక ఓడిపోయిందని ఒప్పుకున్నారని వెల్లడించారు. పదే పదే సాక్షి మీడియా గురించి మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నామని..., ఐటీ దాడుల్లో సీజ్ చేసిన రూ. 2వేల కోట్లు చంద్రబాబువని ప్రచారం చేసి బొక్క బోర్లా పడినా... ఇంకా తీరు మారకపోవటం దురదృష్టకరమని విమర్శించారు. దాన్ని మభ్యపెట్టేందుకు నవంబర్ 11నాటి ఐటీ దాడుల ప్రకటనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆయన అన్నారు. ఐటీ అధికారులు విడుదల చేసిన పత్రం వైకాపాకు చెంపపెట్టు అని అని ఆయన అన్నారు.
'రూ. 150 కోట్లు తీసుకుని పోలవరం కట్టబెట్టారు'
ఐటీ సోదాల విషయంలో చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. నవంబర్ 11నాటి ఐటీ దాడుల ప్రకటనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు అందులో పేర్కొన్న రూ. 150 కోట్లు జగన్కు చెందినవేనని, అందుకు ప్రతిఫలంగా ఓ ఇన్ ఫ్రా కంపెనీకి పోలవరం కట్టబెట్టారని వర్ల ఆరోపించారు.
'అందుకు ప్రతిఫలంగానే పోలవరం కట్టబెట్టారు'