నలంద కిశోర్ మృతికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహరంలో కక్ష సాధింపు ధోరణితో కిశోర్‌ను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ తీరే ఆయన మృతికి కారణమైందన్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా...అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో తిట్టించడం దారుణమన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన సుదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కక్ష సాధింపు చర్యల వల్లే కిశోర్ మృతి: తెదేపా నేత చినరాజప్ప - tdp leader nimmakayala chinarajappa
ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి వల్లే నలంద కిశోర్ మృతి చెందారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగడం దారుణమన్నారు.
tdp leader nimmakayala chinarajappa