ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి ఉద్యమకారులకు పాదాభివందనం: నారా లోకేశ్ - amaravathi movement news

జై అమరావతి ఉద్యమం భావితరాలకు పోరాట స్ఫూర్తిని అందించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రమంతా అమరావతి గట్టుకి చేరుకుంటే జగన్ మాత్రం 3 ముక్కలాట వైపు ఉన్నారని విమర్శించారు.

lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

By

Published : Dec 16, 2020, 12:25 PM IST

రాష్ట్రం మొత్తం అమరావతి గట్టుకి చేరుకుంటే తుగ్లక్ జగన్ మాత్రమే మూడు ముక్కలాట వైపు ఉండిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. నియంత పొగరు అణిచి జై అమరావతి అనిపించే శక్తి అమరావతి ఉద్యమకారులకు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల పోరాటం వృథాపోదన్న లోకేశ్... విజయం మరెంతో దూరంలో లేదని పేర్కొన్నారు. భావి తరాలకు స్ఫూర్తినిచ్చిన అమరావతి ఉద్యమకారులకు పాదాభివందనం అంటూ కొనియాడారు. ఎత్తిన జెండా దించకుండా, దిక్కులు పిక్కటిల్లేలా జై అమరావతి అంటూ అందుకున్న నినాదం అలుపు లేకుండా ఏడాది పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. అమరావతిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను వైకాపా నేతలు గ్రాఫిక్స్ అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భావితరాల కోసం భూత్యాగం చేసిన రైతుల్ని రోడ్డు కీడ్చారని ఆక్షేపించారు. దేవుడు అన్నీ గమనిస్తున్నాడని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details