వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే 11,611 కోట్లు రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపారని తెదేపా నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు చూసి ఇళ్లల్లో గుడ్డి దీపాలు వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయని విమర్శించారు. ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల వద్ద నుంచి వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. 2019-20 లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు తగ్గినా ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం దుర్మార్గమన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 24,491 కోట్లు అప్పు తెచ్చినా ఆ అప్పు తన అవినీతికి, దుబారాకు ఖర్చు చేసారని కళా మండిపడ్డారు.
Kala Venkatrao: రెండున్నరేళ్లలోనే 11,611 కోట్ల భారం మోపారు
జగన్రెడ్డి విడతల వారీగా కరెంటు ఛార్జీలు పెంచుతూ సామాన్యులపై అధిక భారం మోపుతున్నారని తెదేపా నాయకుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. విద్యుత్ గురించి తలుచుకుంటేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ఎద్దేవ చేశారు.
తెదేపా నాయకుడు కళా వెంకట్రావు
TAGGED:
Kala Venkatrao latest news