చంద్రబాబు, ఎంపీ జయదేవ్ అరెస్టు హేయమైన చర్య అని కళా వెంకట్రావు మండిపడ్డారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎంను గుంతలున్న రోడ్లపై తిప్పటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఎంపీ గల్లా జయదేవ్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. ఒక ప్రజాప్రతినిధికి గాయాలయ్యేట్లు పోలీసులు ప్రవర్తిస్తారా అంటూ దుయ్యబట్టారు.
'3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?' - రాజధాని అంశంపై మాజీ మంత్రి తాజా వార్తలు
రాజధాని అంశం మీద ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రజాప్రతినిధులతో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
మాజీ మంత్రి కళా వెంకట్రావు
Last Updated : Jan 21, 2020, 2:06 PM IST