ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతులకు అండగా... రాష్ట్ర వ్యాప్తంగా..!

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రైతులకు అన్యాయం చేయకూడదని డిమాండ్ చేశారు.

Statewide support for the Amravati movement
అమరావతి ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త మద్దతు

By

Published : Oct 11, 2020, 9:20 PM IST

అనంతపురంలో...

రాజధాని అమరావతిని పరిరక్షించాలని రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా... తెదేపా నేతలు ఆకాశంలోకి లాంతర్లు వదిలారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రధాన వీధుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా సాధించేంతవరకు ఉద్యమం చేస్తున్న రైతులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాయదుర్గం వినాయక సర్కిల్​లో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్కై లాంతర్లు, కొవ్వొత్తులతో ఆందోళన చేశారు. గుంతకల్లులో తెలుగుదేశం నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను మోసగిస్తున్న జగన్ పాలన... రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సంక్షోభం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లాలో...

బి.కొత్తకోటలో అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా... తెదేపా నేతలు స్కై లాంతర్లతో నిరసన చేపట్టారు. వెదురుకుప్పంలో తెలుగుదేశం నేతలు స్కై లాంతర్లు ఎగురవేశారు. అమరావతి ఆంధ్రుల రాజధాని అంటూ నినాదాలు చేశారు. పార్టీ తరఫున రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. శాంతిపురంలో కొవ్వొత్తులు వెలిగించి రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

కర్నూలులో...

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులో తెదేపా కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిచ్చిన ముఖ్యమంత్రి జగన్... అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరులో...

అమరావతి రైతులకు సంఘీభావంగా... గుంటూరులో తెదేపా నేతలు స్కై ల్యాంపులు వెలిగించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెద్దకాకానిలో సీపీఐ ,సీపీఎం నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో...

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కనిగిరిలో తెలుగు దేశం నేతలు స్కై లాంతర్లు ఎగురవేశారు.

కృష్ణా జిల్లాలో...

విజయవాడ గొల్లపూడిలో తేదేపా నాయకులు కాగడాల ప్రదర్శ చేపట్టారు. రాజధాని రైతులకి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

దారుణం: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు

ABOUT THE AUTHOR

...view details