ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వాప్తంగా కర్ఫ్యూ.. పకడ్బందీగా అమలు - ఆంధ్రప్రదేశ్ కర్ఫ్యూ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం తరువాత ప్రజా రవాణా ప్రైవేటు వాహనాలు సైతం నిలిచిపోయాయి. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ap curfew
ap curfew

By

Published : May 6, 2021, 3:36 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో..

తణుకులో కర్ఫ్యూ అమలు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అనవసరంగా రహదారుల మీదకు వచ్చేవారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఉండ్రాజవరంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో...

విజయవాడలో వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ నిబంధనలకు పాటిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత నగర రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లాలో కొవిడ్ కర్ఫ్యూ ఆంక్షలు రెండో రోజు కొనసాగాయి. మధ్యాహ్నం 12గంటలకు దుకాణాలు, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. పోలీసులు అన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవల మినహా అన్ని కార్యకలాపాలు నిలిపివేయటంతో రహదారులు బోసిపోయి కనిపించాయి.

తూర్పు గోదావరి జిల్లాలో..

అమలాపురం డివిజన్ వ్యాప్తంగా రెండోరోజు కర్ఫ్యూ విజయవంతంగా అమలవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరులో రెండోరోజు కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు కర్ఫ్యూ సడలిస్తున్న అధికారులు, అనంతరం ఆంక్షలు అమలు చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన ప్రజలు కర్ఫ్యూ మొదలయ్యే సమయానికి తిరిగి వెళ్లే సమయంలో నగరం రద్దీగా ఉంటోంది. ఆంక్షల మొదలైన అరగంట కల్లా నగరం నిర్మానుష్యంగా మారుతోంది. ప్రధాన రహదారులపై బ్యారీకేట్లు ఏర్పాటుచేసిన పోలీసులు అత్యవసర వాహనాలు తప్ప వేటినీ అనుమతించడం లేదు. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు రెండోరోజు నిలిచిపోగా, దుకాణాలు మూతపడ్డాయి.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లాలో అధికారులు రెండో రోజూ కర్ఫ్యూను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తి స్థాయి కర్ప్యూ అమలవుతోంది.

కడప జిల్లాలో..

జిల్లాలో రెండు రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎస్పీ అన్బురాజన్ రైల్వే కోడూర్​లో ఆంక్షల అమలు తీరును పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

ఇదీ చదవండి:

వరికి గిట్టుబాటు ధరలేక అన్నదాతల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details