కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలనూ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తోపాటు గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఈ వివరాలను నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అన్లాక్ ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలు దశలవారీగా తెరవాలని నిర్ణయించటంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను సేకరించేందుకు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్టు తెలియచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా విద్యా సంస్థల వివరాలను, విద్యార్ధులు, అధ్యాపకుల వివరాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఈ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. స్థానికంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలను ట్యాగింగ్ చేసి వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది.
విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ఆదేశాలు...