లాక్ డౌన్ దృష్ట్యా నిత్యావసర వస్తువులను వేగంగా చేరవేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త చర్యలు తీసుకుంది. 'జైకిసాన్' పేరిట ప్రత్యేక రవాణా రైళ్లను ప్రవేశపెట్టింది. వేర్వురు స్టేషన్ల నుంచి రెండు గూడ్స్ రైళ్లు జత చేసి ఒకే రైలుగా మార్చి జైకిసాన్ రైలుగా నడుపుతున్నారు. రెట్టింపు సామర్ధ్యంతో తక్కువ సమయంలో సరుకు రవాణా చేసేలా దీన్ని రూపొందించారు. ఒక గూడ్స్ రైలులో 42 వ్యాగన్లు ఉంటాయి. రెండు రైళ్లు కలపడం వల్ల మొత్తం 84 వ్యాగన్లలో 5200 టన్నుల సరుకును ఒకేసారి చేరవేయవచ్చని అధికారులు తెలిపారు.
సరుకు రవాణాకు 'జైకిసాన్' పేరిట ప్రత్యేక రైళ్లు - latest updates of corona
నిత్యావసర వస్తువులను వేగంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే 'జైకిసాన్' పేరిట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
special-trains-for-freight-transport-with name-on jaikisan