ఇసుక ధరలకు కళ్లెం వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా పెంపుపై తాడేపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి, గనులశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధర నిర్ణయించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎంత రేటు ఉండాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని దిశానిర్దేశం చేశారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలని సీఎం చెప్పారు. ఇసుక రేటు నిర్ణయించాకే ధరలను ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలని సూచించారు.
ఇసుక రీచ్‌ల్లో నిఘా నేత్రాలు