రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపునిచ్చింది. ‘'ఆంధ్ర విత్ అమరావతి'’ నినాదంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ప్రారంభించింది. వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గ్రూప్‌లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతికి మద్దతు పలకాలని కోరుతూ.. మిస్డ్‌కాల్ విధానాన్ని చేపట్టింది. స్వచ్ఛందంగా వాలంటీరుగా చేరేందుకు ఈ లింకులపై క్లిక్ చేయాలని ఐకాస నేతలు సూచించారు. ఒకసారి క్లిక్ చేస్తే ఉద్యమంలో భాగస్వాములవుతారని ..ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని వివరించారు.
మిస్డ్‌కాల్ నంబరు: 8460708090
వాట్సాప్: https://cutt.ly/andhrawithamaravati
ట్విటర్: www.twitter.com/APwithAmaravati
ఇన్‌స్టాగ్రామ్: www.instagram.com/andhra withamaravati