ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: హేమంత్ హత్యకు పథకం ఇలా… - Hemanth murder case remand report

తెలంగాణలో కలకలం రేపిన హేమంత్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. హేమంత్ హత్యకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఎలా ప్రణాళిక రచించాడు.. తదితర విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

hemantha murder planned in this way..
తెలంగాణ: హేమంత్ హత్యకు పథకం ఇలా…

By

Published : Sep 26, 2020, 7:53 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హేమంత్ పరువు హత్యకేసులో కీలక విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన హేమంత్‌, లక్ష్మారెడ్డి కుమార్తె అవంతి రెడ్డి జూన్‌ 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. జూన్‌ 11న అవంతి- హేమంత్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి నాలుగు నెలల పాటు అవంతి తల్లిదండ్రులు ఇల్లు దాటి బయటకు రాలేదు. పగతో రగిలిపోతున్న లక్ష్మారెడ్డి.. హేమంత్‌ను తన కుమార్తెకు దూరం చేసేందుకు నెల క్రితమే ప్లాన్‌ చేశాడు. లక్ష్మారెడ్డి భార్య అర్చన సోదరుడు యుగేంధర్‌రెడ్డి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు.

తన అక్క, బావ ఆవేదన చూడలేక.. హేమంత్‌, అవంతిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు యుగేందర్‌ రెడ్డి. ఈ క్రమంలో అవంతి ఇంటికోసం యుగేందర్‌రెడ్డి, అతని సోదరుడు విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రెక్కీ నిర్వహించారు.

ఈనెల 24 మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు.. కిరాయి హంతకులు హేమంత్‌, అవంతిపై దాడి చేస్తూ బలవంతంగా కారులో ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుకుందామని కారు గోపన్‌పల్లి వైపు మళ్లించారు. గోపన్‌పల్లి వద్ద కారునుంచి అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. పారిపోతున్న వారిద్దరినీ పట్టుకున్నారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు కారులోనే హేమంత్‌ను హతమార్చారు. నిందితులు లక్ష్మారెడ్డి, అర్చన మాత్రం సీన్‌లో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

సంబంధిత కథనం:

పరువు హత్య సినీ ఫక్కీలో అల్లుని ఖూని.. మామతో సహా 14 మంది కటకటాల్లోకి...

ABOUT THE AUTHOR

...view details