ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేం ఏ పార్టీకీ అనుకూలంగా లేం: సచివాలయ ఉద్యోగుల సంఘం - ఏపీ సచివాలయ ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్ న్యూస్

సచివాలయ ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్​లో చేర్చారని.. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రాజధాని తరలింపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ... తాము వాస్తవాలతో కూడిన సమాధానం హైకోర్టుకు చెప్పినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్పష్టం చేశారు.

secretariat employees union
సచివాలయ ఉద్యోగుల సంఘం

By

Published : Jul 30, 2020, 5:02 PM IST

అమరావతి పరిరక్షణ సమితి.. ఏపీ ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు వేశారని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్​లో చేర్చారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్​లో ఇంప్లీడ్ అయినట్లు స్పష్టం చేశారు.

రాజధాని తరలింపుపై బిల్లు పాస్​ అయితే, కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. అది కూడా విదాయ సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలనీ.. ఎవర్నీ తక్షణమే రావాలని ఇబ్బందులు పెట్టొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజధాని తరలింపు కోసం 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్​కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పినట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులకు రాజకీయలకు సంబంధం లేదనీ.. తాము ఏ పార్టీకీ అనుకూలంగా లేమని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details