ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త రాజధానిలో ఉద్యోగులకు అన్ని రకాల వసతులు: సజ్జల - ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

కొత్త రాజధానిలో సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వెలగపూడిలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

By

Published : Dec 14, 2020, 7:13 PM IST

విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న కొత్త రాజధానిలో సచివాలయ ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొత్త రాజధానిలో ఉద్యోగుల కోసం అన్ని రకాల వసతులతో కూడిన స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్​ను ప్రారంభించారు. ఇందులో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సహా సంఘ నేతలు పాల్గొన్నారు.

కోపం పెంచుకుంటున్నారు...

స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కొత్త రాజధానిపై ఆసక్తికర చర్చ జరిగింది. కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ వేయాలని స్థానిక టెంట్ హౌస్ వారిని తాము అడిగామని... సచివాలయంలో టెంట్ వేసేందుకు ఎవరూ రాలేదని ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇక్కడి ప్రజలు... ఉద్యోగులపై ద్వేషం పెంచుకుంటున్నారని అనుకుంటున్నామని.. వీలైనంత త్వరగా ఉద్యోగులను కొత్త రాజధానికి తీసుకుపోవాలని సజ్జలను కోరారు.

ఇదీ చదవండి

రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ!

ABOUT THE AUTHOR

...view details