JAC letter to RTC MD ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు సహా పలు కీలక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు... ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస మరో మారు విజ్ఞప్తి చేసింది. సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఐక్యవేదిక నేతలు... ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా 14 సంఘాల నేతలు సంతకాలు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు విజ్ఞాపన పత్రాలిచ్చినా సమస్యలు పరిష్కారానికి కనీస చర్యలు తీసుకోవడంలేదని ఎండీకి రాసిన లేఖలో ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న 45 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల పరిష్కారానికి సంఘాల నేతలతో చర్చించాలని కోరినా.. పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈనెల 2న ఎండీకి మరోసారి విజ్ఞాపన పత్రాలిచ్చినా స్పందించలేదని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు... ఎండీ దృష్టికి తెచ్చారు. సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సంతకాలు సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎండీని ఐక్యవేదిక నేతలు కోరారు.
పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలంటూ, ఆర్టీసీ ఎండీకి జేఏసీ లేఖ - ఏపీ తాజా వార్తలు
JAC letter to RTC MD తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస లేఖ రాసింది. పీఆర్సీ అమలు సహా పలు కీలక సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేఖలో కోరారు. సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఆర్టీసీ