తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బిచ్కుంద మండలం చిన్నదేవడలో వివాహం జరుగుతున్న ఇంటికి నీటిని తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. మరికాసేపట్లో బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా సందడిగా ఉండాల్సిన చోట విషాదం అలుముకుంది.
ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి - కామారెడ్డి జిల్లాలో రొడ్డు ప్రమాదం
కాసేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం నిండింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో జరిగింది.
ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి
క్షతగాత్రుల్ని బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు తుకారం (దేవడా గ్రామం), సాయి (బిచ్కుంద), శంకర్(మద్నూర్)గా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి : ఏలూరు వింత వ్యాధికి పురుగు మందులే కారణం..!