దేశంలోనే అగ్రగామి పోర్టుగా విశాఖ పోర్టు పురోగతిని నమోదు చేస్తోందని ఆ సంస్ధ ఛైర్మన్ కె. రామ్మోహనరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోర్టు స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. వందనం సమర్పించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని అందరూ అందుకోవాలని రామ్మోహనరావు పిలుపునిచ్చారు.
విశాఖ పోర్టు స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
విశాఖ పోర్టు స్టేడియంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పోర్టు ఛైర్మన్ కె. రామ్మోహనరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. వందనం సమర్పించారు.
republic day celebrations at vishaka port stadium