ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రికి కమిటీ నివేదిక

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రి జగన్​కు నివేదిక అందింది. నివేదికపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.

ముఖ్యమంత్రికి నివేదిక

By

Published : Sep 3, 2019, 5:27 PM IST

Updated : Sep 3, 2019, 10:23 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నియమించిన కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్​కు అందజేసింది. అంజనేయరెడ్డి నేతృత్వంలో కమిటీ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి నివేదిక సమర్పించింది. విలీన విధివిధానాలపై పలు మార్గదర్శకాలతో నివేదిక రూపొందించిన కమిటీ...ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు, మెరుగైన నిర్వహణ మెుదలైన అంశాలను నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటంపై సానుకూలంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదికపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు.

అధికారులతో సీఎం సమీక్ష
ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది. దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల వయస్సు 60 ఏళ్లుకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Sep 3, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details