ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagananna Smart Township ఒక్కరూ ముందుకు రాలేదు - Jagan Smart Township

Reluctance of traders : మధ్య ఆదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్థిరాస్తి వ్యాపారుల కంటే తక్కువ ధరకు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు భూముల్లో మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం వేసిన ప్రణాళికకు చుక్కెదురైంది.

Reluctance to give lands
ఒక్కరూ ముందుకు రాలేదు

By

Published : Sep 5, 2022, 9:07 AM IST

Reluctance to give lands ప్రైవేటు భూముల్లో మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం వేసిన ప్రణాళికకు చుక్కెదురైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో భూములిచ్చేందుకు స్థిరాస్తి వ్యాపారులు ముందుకు రావడం లేదు. పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ) ఇచ్చిన ప్రకటనలకు స్పందన కొరవడింది. ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. మధ్య ఆదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 7 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 14 చోట్ల ఎంఐజీ లేఅవుట్లలో స్థలాల కోసం ప్రస్తుతానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారుల కంటే తక్కువ ధరకు, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల నుంచి స్పందన బాగుందని అసెంబ్లీ నియోజకవర్గానికో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది.

భూముల ధరలు భారీగా ఉన్నచోట వాటిని సేకరించి ప్రజలకు అందుబాటు ధరల్లో స్థలాలు విక్రయించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు కనీసం 20 ఎకరాలకు తక్కువ కాకుండా భూములిచ్చే వ్యాపారుల నుంచి పట్టణాభివృద్ధి సంస్థలు గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ), తిరుపతి, అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనూ వ్యాపారుల నుంచి స్పందన లేదు. 17 పట్టణాభివృద్ధి సంస్థల్లో 350 నుంచి 500 ఎకరాల్లో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు దరఖాస్తులొస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికీ కనీసం 100 ఎకరాలైనా ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఎందుకీ విముఖత?

వ్యాపారుల నుంచి సేకరించిన భూముల్లో వేసే లేఅవుట్లలో కనీసం 40% విస్తీర్ణంలోని ఇళ్ల స్థలాలను మధ్య ఆదాయ వర్గాలకు పట్టణాభివృద్ధి సంస్థలు విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అందులోంచి 4% వివిధ రుసుముల కింద మినహాయించి మిగిలిన 96% వ్యాపారులకు చెల్లించనున్నారు. వీటిని ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందో? లేదో? అనే అనుమానం వ్యాపారవర్గాల్లో వ్యక్తమవుతోంది.

* వ్యాపారుల్లో ఎక్కువ మంది రైతుల నుంచి ఒకేసారి కాకుండా దశలవారీగా భూముల కొనుగోళ్లపై ఒప్పందం చేసుకుంటున్నారు. అదే రీతిన లేఅవుట్ల ఏర్పాటుకు పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు పొందుతున్నారు. ఒకేసారి 20 ఎకరాలు, ఆపైన రైతుల నుంచి కొని యాజమాన్య హక్కులు పొందేది తక్కువ. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ల కోసం కనీసం 20 ఎకరాలివ్వాలని ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ మేరకు కనీసం 20 ఎకరాలకు రైతులతో ఒప్పందం చేసుకుని పట్టణాభివృద్ధి సంస్థతో మరోసారి ఒప్పందం అంటే మొత్తం వ్యాపార విలువలో 18% జీఎస్‌టీ చెల్లించాలి. ఇది భారమవుతుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details