ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rakesh Tikait in Hyderabad: 'భాజపాకు ఎవరూ ఓటేయొద్దు.. తెరాస వైఖరి సరిగా లేదు'

తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతామని సంయుక్త కిసాన్​ మోర్చా నేత రాకేశ్​ టికాయత్(rakesh tikait latest news)​.. స్పష్టం చేశారు. ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. దేశంలో వ్యవసాయ చట్టాల రద్దును (farm laws repeal news) పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌లో చేపట్టిన మహాధర్నా(Farmers Associations Dharna at Indira park)లో పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావల్సిందేనని డిమాండ్​ చేశారు.

Rakesh Tikait in Hyderabad
Rakesh Tikait in Hyderabad

By

Published : Nov 25, 2021, 5:40 PM IST

భాజపాకు ఎవరూ ఓటేయొద్దు.. తెరాస వైఖరి సరిగా లేదన్న రాకేశ్ టికాయత్

సాగు చట్టాలను రద్దు(farm laws repeal news) చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించినా ఎన్నో సందేహాలు ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్‌సింగ్ టికాయత్(Rakesh Tikait latest statement) అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌లో మహాధర్నా(Farmers Associations Dharna at Indira park) చేపట్టారు. సాగు చట్టాలు రద్దు(farm laws repeal news) చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా(Farmers Associations Dharna at Indira park) జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం నేత రాకేశ్ టికాయత్‌, ఏఐకేఎస్ నేతలు హన్నన్ మొల్ల, అతుల్ కుమార్ అంజన్, జాగ్తర్ బజ్వా, ఆశిష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, తీగల సాగర్, విస్సా కిరణ్ కుమార్, వేములపల్లి వెంకటరామయ్య, విమలక్క తదితరులు పాల్గొన్నారు.

దిల్లీలో ఏడాది పాటు ఉద్యమం చేయటం ఇదే తొలిసారి అని టికాయత్​ తెలిపారు. మోదీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదన్న టికాయత్​.. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలన్నారు. కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావల్సిందేనని డిమాండ్​ చేశారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతామన్న టికాయత్‌.. ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణలో తెరాస వైఖరి సరిగాలేదు..

"భాష వేరైనా మనందరి భావన ఒక్కటే. కేవలం సాగుచట్టాల రద్దు కోసమే మా పోరాటం కాదు. మోదీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మోదీ సర్కారు కొనసాగుతోంది. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోంది. దిల్లీలో ఏడాది పాటు ఉద్యమం ఇదే తొలిసారి. కార్పొరేట్ల లబ్ధికి మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. సాగుచట్టాల రద్దుపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. భాజపాకు ఎవరూ ఓటు వేయవద్దు. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పిలుపిచ్చాం. ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం చెల్లించాలి. కనీస మద్దతు ధరల చట్టం తీసుకురాల్సిందే. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలి. కమిటీలో ఎస్‌కేఎం నేతలు, శాస్త్రవేత్తలను భాగస్వాములు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లు రద్దుపై ప్రధాని సమాధానమివ్వాలి. విత్తనబిల్లు తీసుకురాకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారు. ఇప్పటికైనా మేం చర్చలకు సిద్ధం, విస్తృతంగా చర్చిద్దాం. మా డిమాండ్లు కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతాం. డిమాండ్లు ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. రైతు ఉద్యమంపై తెరాస వైఖరి స్పష్టం చేయాలి. తెలంగాణలో ధాన్యం సేకరణలో తెరాస వైఖరి సరిగా లేదు." - రాకేష్​సింగ్​ టికాయత్​, సంయుక్త కిసాన్ మోర్చా నేత

చరిత్రలో సువర్ణాక్షరాలతో..

సాగు చట్టాల రద్దు కోసం రైతాంగం వీరోచిత పోరాటం సాగుతుందని సీపీఎం అనుబంధ ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల అన్నారు. సున్నా డిగ్రీ చలి, వర్షాల్లో సైతం మొక్కవోని ధైర్యంతో ఉద్యమం సాగిందని తెలిపారు. డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదని.. విరమించేది లేదని స్పష్టంచేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని తేల్చిచెప్పారు. రైతు ఉద్యమంలో కేసీఆర్, తెరాస కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details