ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TG-RAITHUBANDHU: రేపటి నుంచే అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము

By

Published : Jun 14, 2021, 8:26 AM IST

తెలంగాణలో రైతుబంధు పథకం అమలుకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి 25వ తేదీ వరకు పెట్టుబడి రాయితీ సొమ్ము.. రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

raithubandhu
raithubandhu

తెలంగాణలో.. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా.. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి విస్తరించిన నేపథ్యంలో.. ఏరువాక పనులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకం కింద 63.25 లక్షల మంది రైతులను.. అర్హులుగా తేల్చింది ప్రభుత్వం. తుది జాబితా విడుదల చేసిన సీసీఎల్​ఏ.. వ్యవసాయ శాఖకు అందజేసింది. ఆ జాబితా ప్రకారం.. 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాల విస్తీర్ణానికి 7,508.78 కోట్ల రూపాయలు అవసరమవుతాయని స్పష్టం చేసింది.

గత యాసంగి సీజన్‌ కన్నా 2.81 లక్షల మంది రైతులు పెరిగినందున.. నూతనంగా మరో 66,311 ఎకరాల విస్తీర్ణం చేరింది. పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఐఎఫ్​ఎస్​సీ కోడ్‌లు మారినా.. ఖాతాదారులు ఆందోళన చెందవద్దు.. ఏమైనా అనుమానాలు ఉంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో రైతుబంధు పథకం కింద.. 4,72,983 మంది రైతులు అర్హులుగా తేలారు. అత్యల్పంగా మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లాలో 39,762 మంది రైతులు అర్హులుగా గుర్తించారు.

ఇదీ చూడండి: Polavaram: పోలవరంపై నేడు దిల్లీలో భేటీ..హస్తినకు జలవనరులశాఖ అధికారులు!

ABOUT THE AUTHOR

...view details