ఏప్రిల్ 9న తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త పార్టీ విధివిధానాలు వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉందని ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం నుంచే షర్మిల శంఖారావం పూరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వైఎస్ అభిమానులతో ఖమ్మంలో రాఘవరెడ్డి సమావేశమయ్యారు. షర్మిల సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
'ఖమ్మం సభలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ విధివిధానాలు ప్రకటించే అవకాశం'
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచే వైఎస్ షర్మిల... శంఖారావం పూరిస్తారని ఆమె ముఖ్య అనుచరుడు రాఘవరెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 9న నిర్వహించే బహిరంగ సభలో కొత్త పార్టీ విధివిధానాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు.
వైఎస్ అభిమానులతో ఖమ్మంలో రాఘవరెడ్డి సమావేశం
ప్రస్తుతం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులపై నేతలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే ఎక్కువ ఆదరణ ఉంటుందనే అంచనాలతో షర్మిల ఇక్కడ సభకు సిద్ధమయ్యారని రాఘవరెడ్డి తెలిపారు. దివంగత వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన శివాయిగూడెం ప్రాంతాన్ని జిల్లా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఇదీ చదవండి: రాజ్‌భవన్‌కు ఎస్ఈసీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గవర్నర్‌తో భేటీ