ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rachabanda: సెప్టెంబరు లేదా అక్టోబరులో రచ్చబండ!

‘రచ్చబండ’ కార్యక్రమాన్ని సెప్టెంబరు 2 లేదా అక్టోబరు 2 నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 2న వైఎస్‌ వర్థంతిని పురస్కరించుకొని ఆ రోజు ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించడమా లేక అక్టోబరు 2న (గాంధీ జయంతి) మొదలు పెట్టాలా అనే విషయంపై కొంత చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.

Rachabanda
Rachabanda

By

Published : Aug 13, 2021, 6:44 AM IST

ముఖ్యమంత్రి పాల్గొనే ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని సెప్టెంబరు 2 లేదా అక్టోబరు 2 నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయాలకు వెళ్లి అక్కడే స్థానిక ప్రజలతో సమావేశమై వారికి ప్రభుత్వ పథకాలు ఎంత మేర అందుతున్నాయి.. వాటిని పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులేమైనా ఉన్నాయా?.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది’ లాంటి అంశాలపై ప్రజలతో మాట్లాడించి తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

సెప్టెంబరు 2న వైఎస్‌ వర్థంతిని పురస్కరించుకొని ఆ రోజు ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించడమా లేక అక్టోబరు 2న (గాంధీ జయంతి) మొదలు పెట్టాలా అనే విషయంపై కొంత చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కొవిడ్‌-19 మూడో వేవ్‌ ప్రభావాన్ని బట్టి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఈ నెల 6న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి త్వరలోనే తానూ సచివాలయాల సందర్శనకు వెళ్లనున్నట్లు మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:

Land Survey: జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details