ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PRC Leaders Meet CM: డిమాండ్లు పరిష్కరించినందుకు ధన్యవాదాలు: పీఆర్సీ సాధన సమితి - PRC Leaders Meet CM

PRC Leaders Meet CM: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ను.. పీఆర్సీ సాధన సమితి నేతలు కలిశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

PRC Leaders Meet CM
PRC Leaders Meet CM

By

Published : Feb 6, 2022, 12:17 PM IST

PRC Leaders Meet CM: పీఆర్సీ సాధన సమితి నేతలు ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సీఎంను కలిశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బుగ్గన, సీఎస్ కూడా అక్కడే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినందుకు సీఎం జగన్‌కు పీఆర్సీ సాధన సమితి నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం సీఎంతో సమావేశానికి దూరంగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details